ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మొదటి స్థానంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. గతసారి కంటే మోదీ 3 స్థానాలు పైకి ఎగబాకారు. ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌కు వరుసగా మూడోసారి గుర్తింపు లభించింది.
ఆస్ట్రేలియాకు చెందిన ‘లోవీ ఇన్‌స్టిట్యూట్’ రూపొందించిన ‘ఆసియా పవర్ ఇండెక్స్-2026’ ఈ వివరాలు ప్రకటించింది. అతిపెద్ద దేశాల్లో.. చైనాతో పోలిస్తే భారత్‌కు ఉన్న వ్యత్యాసం 33.1 పాయింట్లు. 2018లో సూచీ ప్రారంభమయ్యాక ఇంత తక్కువ వ్యత్యాసం ఇదే తొలిసారి.