యునెస్కో నివేదిక

యునెస్కో నివేదిక

భారత్‌లోని స్కూళ్లలో ప్రాథమిక దశ నుంచి 12వ తరగతి వరకు 11 లక్షల మందికిపైగా ఉపాధ్యాయుల కొరత ఉందని యునెస్కో ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ రిపోర్టు ఆన్‌ టీచర్స్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించింది. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. భారత్‌లో ఉపాధ్యాయుల కొరతకు మరో ఉదాహరణ ఏకోపాధ్యాయ పాఠశాలలు. యూనిఫైడ్‌ డిస్టిక్ట్ర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ గణాంకాల ప్రకారం దేశంలో సుమారు లక్ష పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో పని చేస్తున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram