అయిదు కొత్త జాతి మొక్కలు

అయిదు కొత్త జాతి మొక్కలు
  • నల్లమల అటవీ ప్రాంతంలోని అరుదైన మొక్కలపై పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తల బృందం కొత్త జాతి మొక్కలను గుర్తించడంతోపాటు నామకరణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ విశేషాలు అంతర్జాతీయ వృక్షశాస్త్ర జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు డా.సదాశివయ్య బృందం, బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, డెక్కన్‌ రీజినల్‌ సర్కిల్‌కు చెందిన శాస్త్రవేత్తలు గత పదేళ్లుగా నల్లమలలోని వృక్ష జాతులపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆ మొక్కలు పరిశీలిస్తే..

  1. పాంక్రాషియం బ్రమరాంబే: అందమైన తెల్లని పుష్పాలను కలిగి.. భూమి లోపల ఉల్లిగడ్డలా కనిపించే ఈ మొక్కలు నల్లమలలో ఉన్నాయి. ఈ మొక్క ఆకుల నుంచి సిల్వర్‌ నానో పార్టికల్‌ తయారు చేయొచ్చని, వీటికి బాక్టీరియాను చంపే గుణం ఉందని గుర్తించారు.

  2. బాకిస్టెల్మబైలోబేటం: అతి సన్నని కాండం కలిగిన ఈ మొక్కకు భూమి లోపల బంగాళదుంప లాంటి నిర్మాణం ఉంటుంది. తొలకరి వర్షాల సమయంలో పెరిగి రెండు మూడు నెలల్లోనే జీవిత చక్రాన్ని ముగిస్తాయి. వీటి దుంపలను అడవి పందులు, ఇతర జంతువులు సహా కొన్ని తెగల ప్రజలు ఆహారంగా తీసుకుంటారు.

  3. యుఫోర్బియా తెలంగాణెన్సిస్‌: పాలవంటి స్రవాన్ని స్రవించే ఈ మొక్క రాళ్ల మధ్య నీడలో పెరుగుతుంది. రెండు మి.మీ. పరిమాణంలో పుష్ప విన్యాసం కలిగి ఉంది.

  4. అమ్మానియా తెలంగాణెన్సిస్‌: తడి నేలల్లో నీటికి దగ్గరగా పెరిగే ఈ మొక్కకు ఇతర మొక్కలతో పోలిక ఉన్నప్పటికీ కొన్ని నిర్దిష్టమైన లక్షణాల ఆధారంగా కొత్త మొక్కగా పరిగణించారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డెక్కన్‌ రీజనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు పేరు పెట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram