‘అవెండస్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూ35 లిస్ట్‌ 2026’

‘అవెండస్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూ35 లిస్ట్‌ 2026’
  • దేశంలో యువ సారథుల (35 ఏళ్లలోపు యువతీ యువకుల) నేతృత్వంలోని కంపెనీల విలువ మొత్తం రూ.48 లక్షల కోట్లకు చేరిందని ‘అవెండస్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూ35 లిస్ట్‌ 2026’ నివేదిక వెల్లడించింది. 2025తో పోలిస్తే ఈ విలువ 23% అధికమని పేర్కొంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న యువ పారిశ్రామికవేత్తలు, వారసుల సంఖ్య గత ఏడాది (2025) 155 కాగా, 2026లో 16% పెరిగి 180కి చేరుకుంది. వీరిలో 71% మంది సొంతంగా వ్యాపారాలను ప్రారంభించిన తొలితరం పారిశ్రామికవేత్తలేనని నివేదిక తెలిపింది.

  • సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి, కనీసం 5 కోట్ల డాలర్ల (సుమారు రూ.475 కోట్ల) విలువ కలిగిన సంస్థలను నిర్మించిన తొలి తరం వ్యవస్థాపకులతో పాటు, కనీసం 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.950 కోట్ల) విలువ కలిగిన కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న తరువాతి తరం నాయకులకు ఈ జాబితాలో స్థానం కల్పించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram