భారత్ వద్ద ప్రస్తుతం 190 అణ్వాయుధాలున్నాయని, శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయేలా సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలను నిరంతరం ఆధునికీకరిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ వెల్లడించింది.
ముందుగా అణు దాడి చేయం అనే సూత్రానికి కట్టుబడి ఉంటూనే శత్రువులు దాడికి పాల్పడితే కోలుకోలేని దెబ్బతీసే రీతిలో భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో న్యూక్లియర్ ట్రయాడ్‌ను భారత్ సిద్ధంగా ఉంచుకుంది.