దేశీయ తయారీ పరిశ్రమల్లో మొత్తం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2 కోట్లను అధిగమించింది. తయారీ రంగం జోరందుకోవడంతో 2024-25లో ఇది సాధ్యమైందని 2026, సెప్టెంబరు 30న వెలువడిన యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ (ఏఎస్‌ఐ) చెబుతోంది. 2023-24లో ఈ సంఖ్య 1.96 కోట్లు కాగా, 2024-25 నాటికి 7.19% వృద్ధితో అంటే 14 లక్షలకు పైగా కార్మికులు జత చేరడంతో మొత్తం సంఖ్య 2.1 కోట్లకు చేరింది. సిబ్బందికి చెల్లించిన మొత్తం ప్రోత్సాహకాలు 2023-24 కంటే 2024-25లో 12.08% పెరిగాయి.