భారతదేశంలో 2000-2020 మధ్య ఆర్థిక వృద్ధితో విద్యుత్ వినియోగం దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఇది ‘నేచర్ సిటీస్’ జర్నల్‌లో ప్రచురితమైంది. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుపై అధికంగా ఆధారపడటం వల్ల వాయు కాలుష్యం, పట్టణాల్లో కాలుష్య సంబంధిత మరణాలు పెరిగాయని పేర్కొంది.
ముఖ్యాంశాలు:
2000లో తలసరి జీడీపీ సుమారు 600-700 డాలర్లు ఉండగా, 2020 నాటికి 2,000 డాలర్లకు మించిపోయింది.
విద్యుత్ వినియోగం 2000లో 450 టెరావాట్ గంటలు ఉండగా, 2020లో దాదాపు 2,000 టెరావాట్ గంటలకు చేరింది.
విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 76 శాతం బొగ్గు నుంచే వచ్చింది.