ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్) సంయుక్తంగా ‘పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత సేవల పురోగతి-2015-2025’ అనే నివేదికను తాజాగా విడుదల చేశాయి. దీని ప్రకారం, దేశంలో పాఠశాలలకు వెళ్లే కోట్లాది మంది పిల్లలకు కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు.
ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో పారిశుద్ధ్య సేవలు లేని పిల్లలు 24.4 కోట్ల మంది ఉండగా, వారిలో ఏకంగా 5 కోట్ల మంది భారతీయులే. అంటే, ప్రపంచంలో ఈ సౌకర్యాలు లేని ప్రతి ఐదుగురు పిల్లల్లో దాదాపు ఒకరు మన దేశానికి చెందినవారే.