‘ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026’

‘ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026’

దేశంలో ఆగస్టు 24, 2026 నాటికి రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న సంపన్నుల సంఖ్య 1,810కి పెరిగినట్లు ‘ఎం3ఎం హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026’ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారతీయ కుబేరుల మొత్తం సంపద రూ.187.5 లక్షల కోట్లకు (1.96 ట్రిలియన్‌ డాలర్లు) చేరింది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. బిలియనీర్ల (కనీసం 100 కోట్ల డాలర్ల ఆస్తి ఉన్న వారు) సంఖ్య 391కి చేరి సరికొత్త చరిత్రను సృష్టించింది.

  • దేశంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని గౌతమ్‌ అదానీ కుటుంబం దక్కించుకుంది. అదానీ నికర ఆస్తి విలువ 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు పరిమితమవడంతో అదానీ ఆయన కంటే రూ.59,400 కోట్ల ముందంజలో నిలిచారు. యార్సెలర్‌ మిత్తల్‌ అధిపతి ఎల్‌.ఎన్‌.మిత్తల్‌ కుటుంబం 93 శాతం శాతం వృద్ధితో రూ.3.39 లక్షల కోట్ల సంపద నమోదు చేసి, మూడో స్థానానికి ఎగబాకింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram