ప్రపంచంలో రెండింతలైన బియ్యం ఉత్పాదన

ప్రపంచంలో రెండింతలైన బియ్యం ఉత్పాదన
  • చైనా, భారత్, థాయ్‌లాండ్‌లు ప్రపంచంలో అత్యధికంగా వరి పండిస్తున్న దేశాలని అమెరికాకు చెందిన ఇల్లినోయి అర్బానా షాంపేన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. 2006 నుంచి 2015 వరకూ ప్రపంచంలో మొత్తం 71.3 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా ఈ మూడు దేశాలు ఉత్పాదనలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయని తెలిపారు.
  • 1960 దశకం నుంచి 2010 దశకం వరకూ ప్రపంచంలో వరి ఉత్పాదన రెండింతలయ్యిందని వారు వెల్లడించారు. విస్తరించిన నీటిపారుదల, పెరిగిన పోషకాల వాడకం వంటి సేద్య నిర్వహణ ప్రక్రియలు ఉత్పాదనను స్థిర వృద్ధి దిశగా నడిపాయని, వాతావరణ ప్రతికూలతల కారణంగా తలెత్తిన నష్టాలను భర్తీ చేశాయని అధ్యయనకర్తలు తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram