2010 నుంచి ఇప్పటి వరకు సగటున ఏడాదికి 13.5 లక్షల మంది చొప్పున భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి మొత్తం 1.9 కోట్ల మంది సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాలకు వెళ్లినట్లు ఒక అధ్యయనం తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్, హాంగ్‌కాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.