అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఆ దేశంలో జీవించి ఉన్న అతిగొప్ప వలసదార్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 250 మందితో కూడిన ఈ జాబితాలో 27 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజం, సైన్స్, సంప్రదాయం, ప్రజా జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన వ్యక్తులతో ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది.
భారత్ నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, పెప్సికో మాజీ అధిపతి ఇంద్రా నూయి, సైబర్‌సెక్యూరిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త జయ్ చౌధరీ, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా, ఇన్వెస్టర్ నవల్ రవికాంత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.