‘సిప్రి’ నివేదిక

‘సిప్రి’ నివేదిక
  • 2026, జనవరి నాటికి మన దేశం వద్ద 190 అణ్వాయుధాలు (అణు వార్‌హెడ్లు) ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. పాకిస్థాన్‌ కంటే భారత్‌ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ దేశాల అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి 2026, జూన్‌ 8న విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో భారత్‌ 10 వార్‌హెడ్లను పెంచుకుందని ఈ నివేదిక తెలిపింది. 
  • చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram