జాతీయ పశుసంవర్ధక నివేదిక

జాతీయ పశుసంవర్ధక నివేదిక
  • కేంద్ర పశు సంవర్ధకశాఖ 2026, ఏప్రిల్‌ 20న ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2024-25లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్‌ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. 
  • 2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు (సుమారు 44%) పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram