బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 2026

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 2026
  • బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 2026 ప్రకారం ఆసియాలో సంపన్న వ్యక్తిగా అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు. అదానీ గ్రూప్‌నకు పోర్టుల నుంచి ఇంధనం వరకు ఉన్న కంపెనీల షేర్లు దూసుకెళ్లడంతో ఆయన సంపద భారీగా పెరిగింది.
  • తాజా బిలియనీర్ల ర్యాంకింగ్స్‌ ప్రకారం.. గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ 92.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు  రూ.8.4 లక్షల కోట్లు). ముకేశ్‌ అంబానీ సంపద విలువ 90.8 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8.2 లక్షల కోట్లు)గా ఉంది. దీంతో భారత్, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్‌ అదానీ నిలిచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram