ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కామర్స్ ఇంటెలిజెన్స్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) వెల్లడించింది. భారత్ నుంచి 2025-26లో రూ.39,03,730 కోట్ల విలువైన ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి కాగా.. వాటిలో సుమారు రూ.1.77 లక్షల కోట్ల (4.53%) విలువైన ఎగుమతులు ఏపీ నుంచే జరిగాయి.
రూ.9.77 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.