రాష్ట్రానికి గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌

రాష్ట్రానికి గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌

ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ)-3 పథకం కింద రూ.21,838 కోట్లతో విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో 33% (సుమారు రూ.7,207 కోట్లు) గ్రాంటుగా ఇవ్వనుంది. మిగిలిన రూ.14,631 కోట్లను రుణం కింద సమకూర్చుకోవాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 7,872 సర్క్యూట్‌ కి.మీ. 400 కేవీ విద్యుత్‌ లైన్లు, 9,500 ఎంవీఏ సామర్థ్యంతో ఐదు కొత్త సబ్‌ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. జీఈసీ ప్రాజెక్టు అమలుకు కేంద్రం మొత్తం రూ.1.86 లక్షల కోట్లు కేటాయించింది. వాటితో వివిధ రాష్ట్రాల్లో సుమారు 135 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram