స్త్రీశక్తి పథకం

స్త్రీశక్తి పథకం
  • స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 100 కోట్ల మైలురాయిని దాటింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సూపర్‌-6 పథకాల్లో ఒకటైన స్త్రీశక్తి.. 2025, ఆగస్టు 15న ప్రారంభించారు.

  • అయిదు రకాల బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అప్పటి నుంచి 2026, అక్టోబరు 5వ తేదీకి మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 100 కోట్లను దాటింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram