ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న న్యాయాధికారుల (జ్యుడీషియల్ ఆఫీసర్లు) పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారమై అక్టోబరు 1న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీచేశారు. ప్రభుత్వం గెజిట్‌ను సైతం ప్రచురించింది.
న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఇటీవల ఏడు రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అమలయ్యేలా చూసేందుకు న్యాయాధికారుల పదవీ విరమణ వయసును పెంచే విషయంపై ఏపీ సహా పలు రాష్ట్రాలు ఆలోచన చేయాలని సూచించింది.