ఆంధప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం వరకు జలమార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ప్రాథమికంగా రూ.1,700 కోట్ల వ్యయమవుతుందని అంచనా. పీపీపీ విధానంలో చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) జాతీయ జలరవాణా అథారిటీకి సమర్పించారు.
ప్రకాశం బ్యారేజికి ఎగువన కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల దూరంలో ముక్త్యాల నుంచి ఈ జల మార్గం ప్రారంభమవుతుంది. ప్రకాశం బ్యారేజి నుంచి బందరు కాలువ మచిలీపట్నం వరకు 86 కిలోమీటర్ల మేర, మొత్తంగా 168 కి.మీ మేర ఈ జలమార్గం ఏర్పాటు కానుంది.