‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026’

‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026’
  • వేగవంతమైన ఆర్థిక పురోగతి (ఎమర్జింగ్‌ స్టాండ్‌ ఔట్స్‌)ని సాధిస్తున్న విభాగంలో రాష్ట్రానికి చెందిన నాలుగు నగరాలకు గుర్తింపు లభించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ తాజాగా 1,000 అంతర్జాతీయ నగరాల సూచీతో ‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026’ నివేదికను విడుదల చేసింది. ఇందులో గుంటూరు (739), విశాఖపట్నం (755), నెల్లూరు (893), విజయవాడ (932) ర్యాంకులతో ఉన్నాయి.

  • ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన ప్రమాణాలు, పర్యావరణం, పాలన అనే ఐదు అంశాల్ని పరిశీలించి ర్యాంకింగ్‌లు ప్రకటించారు. వేగవంతమైన అభివృద్ధితో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న, జీడీపీ, ఉపాధి కల్పన, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర విభాగాల్లో ప్రపంచ సగటు కంటే మెరుగైన ఫలితాలు కనబరుస్తున్న వాటికి చోటు కల్పించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram