రాష్ట్రానికి రూ.16,627 కోట్ల నిధులు

రాష్ట్రానికి రూ.16,627 కోట్ల నిధులు
  • ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు కేంద్ర ప్రభుత్వం రూ.16,627 కోట్ల 16వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. ఇందులో బేసిక్‌ గ్రాంట్‌ కింద రూ.13,302 కోట్లు, పెర్‌ఫార్మెన్స్‌ గ్రాంట్‌ కింద మరో రూ.3,225 కోట్లు ఇచ్చింది. 2026-27 నుంచి 2030-31 మధ్య అయిదేళ్లపాటు వీటిని రాష్ట్రానికి విడుదల చేయనుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి గత ఐదేళ్లలో రూ.12,800 కోట్లు కేటాయించారు. 16వ ఆర్థిక సంఘంలో దీనికి అదనంగా రూ.3,827 కోట్లను కేంద్రం కేటాయించింది.
  • బేసిక్‌ గ్రాంట్‌ను టైడ్, అన్‌టైడ్‌ కేటగిరీలుగా మళ్లీ విభజించింది. టైడ్‌ నిధుల్లో నుంచి 50% వరకు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో రాష్ట్రాలకు సూచించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram