వీబీ జీరామ్‌జీ 

వీబీ జీరామ్‌జీ 
  • ఆంధ్రప్రదేశ్‌లో 2026, జులై 1 నుంచి అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ (వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌)కి రాష్ట్ర వాటా రూ.5,138.14 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది పథకం అమలుకు 60% వాటా కింద కేంద్రం రూ.7,707.21 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర వాటా కింద 40% నిధులు సమకూర్చాలన్న వీబీ జీరామ్‌జీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.
  • పథకానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ వాటాగా మొత్తం రూ.95,692 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ 2026, జూన్‌ 9న కేటాయించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram