పోలవరానికి మహానది జలాలు

పోలవరానికి మహానది జలాలు
  • మహానది-గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో మార్పులు చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 2026, జూన్‌ 5న హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులతో మహానది నుంచి పోలవరానికి సుమారు 147 టీఎంసీల జలాలు చేరుతాయి. ఫలితంగా ఉత్తరాంధ్రకు, పలు ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు స్థిరీకరణకు మహానది జలాలు ఉపయోగపడనున్నాయి. ఇంతకుముందు మహానది నుంచి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి అనుసంధాన ప్రతిపాదన ఉండేది. దీంతో రాష్ట్రానికి ప్రయోజనం లేదు. 
  • అంతర్రాష్ట్ర జలవనరుల నిపుణులు అధ్యయనం మేరకు.. ఒడిశా దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏయే మార్గాల్లో మహానది జలాలు గోదావరికి తరలిస్తే ఉత్తమమో పరిశీలించి ఈ ప్రతిపాదనను సిద్ధం చేశారు. దీనివల్ల ఏ రాష్ట్రానికీ నష్టం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మహానది అనుసంధాన ప్రవాహ మార్గం మళ్లించుకుంటారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram