హైకోర్టు సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌

హైకోర్టు సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌
  • ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ లిసా గిల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌ జారీచేసింది. సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌ నియామకం ఏప్రిల్‌ 25 నుంచి అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఏప్రిల్‌ 24న పదవీ విరమణ చేయనున్నారు.
  • పంజాబ్‌-హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ లిసా గిల్‌ బదిలీపై వచ్చి.. 2026, మార్చి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram