జాతీయ నమూనా సర్వే

జాతీయ నమూనా సర్వే
  • అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాలు ఏటా సగటున రూ.39,170 సొంత జేబు నుంచి వెచ్చిస్తున్నాయి. ఇది జాతీయస్థాయిలో చేసే సగటు వ్యయం రూ.34,064 కంటే 15% ఎక్కువ. ఈ ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యి శాతం ఎక్కువగా ఉంటోంది. వైద్య సేవల కోసం దేశంలోని కుటుంబాలు చేసే వ్యయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంకాల శాఖ 2025 జనవరి-డిసెంబరు మధ్య కాలంలో నిర్వహించిన 80వ రౌండ్‌ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
  • దేశవ్యాప్తంగా 9,575 గ్రామాలు, 7,945 పట్టణ ప్రాంతాల్లో 1,39,732 కుటుంబాలకు చెందిన 6,51,440 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సర్వే నివేదికను రూపొందించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 21-25% మందికి అనారోగ్య సమస్యలున్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram