ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2005

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2005
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్‌ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని (ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2005).. రాష్ట్ర ప్రభుత్వం 2026, ఏప్రిల్‌ 20న గెజిట్‌లో నోటిఫై చేసింది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-1975 రద్దయి, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
  • రాష్ట్రంలో 26 జిల్లాల ప్రాతిపదికన కొత్త జోన్‌ల విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే రెండు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలకు కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం కేంద్రానికి మళ్లీ ప్రతిపాదన పంపనున్నారు. ఇప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 26 జిల్లాలు, ఆరు జోన్‌లు, రెండు మల్టీజోన్‌ల స్థాయిలో లోకల్‌ కేడర్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోస్టుల్ని 27 నెలల్లోగా ఈ కేడర్‌లలోకి సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram