ఆంధ్రప్రదేశ్‌లో 13,348 పంచాయతీలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాలు రాష్ట్ర ఎన్నికల సంఘం 2026, ఏప్రిల్ 17న అధికారికంగా ప్రకటించింది. మొత్తం 2,89,10,279 మంది ఓటర్లలో పురుషులు 1,42,30,926.. మహిళలు 1,46,77,882.. ఇతరులు 1,471గా వెల్లడించింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 56 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు ప్రచురించలేదు.