ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునేఠాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 2026, ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.