అమల్లోకి భారత్‌-న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ

అమల్లోకి భారత్‌-న్యూజిలాండ్‌ ఎఫ్‌టీఏ

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) 2026, అక్టోబరు 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాలు 100% రద్దవుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ తెలిపారు.

  • ఈ వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు 2026, ఏప్రిల్‌ 27న అధికారికంగా సంతకాలు చేశాయి. కార్మిక ఆధారిత రంగాలైన జౌళి, తోలు ఉత్పత్తులు, పాదరక్ష, రెడీమేడ్‌ దుస్తులు వంటి విభాగాల ఎగుమతిదార్లకు ఇది భారీ అంతర్జాతీయ మార్కెట్‌ అవకాశాలను కల్పించనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram