భారత్‌ నుంచి అమెరికాకు పెట్టుబడులు

భారత్‌ నుంచి అమెరికాకు పెట్టుబడులు
  • తమ దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు ప్రవహించాయని, భారత్‌ నుంచే 330 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.31.35 లక్షల కోట్లు) మేర వచ్చాయని అమెరికా వెల్లడించింది. ప్రపంచదేశాల నుంచి అమెరికాకు వచ్చిన పెట్టుబడుల లెక్కలను తాజాగా వైట్‌హౌస్‌ ప్రకటించింది.

  • యూఎస్‌లో ప్రైవేటు పరిశ్రమలు, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల మొత్తం 10.87 లక్షల కోట్ల డాలర్లని తెలిపింది. కాగా.. అమెరికాలో టెక్సాస్‌ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోన్న కొత్త రిఫైనరీ ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామిగా ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram