అవయవ మార్పిడి చికిత్సలో ఉపయోగించే ఔషధాలతో పాటు, కొన్ని రక్త సంబంధిత వ్యాధులకు వినియోగించే ప్రత్యేక ఔషధాల తయారీకి హైదరాబాద్‌కు చెందిన విన్ బయోప్రోడక్ట్స్, జర్మనీకి చెందిన నియోవి బయోటెక్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ఔషధాల తయారీ, వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలో భాగం. ఇమ్యునోగ్లోబులిన్ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై దృష్టి సారించనున్నారు. ఈ ఒప్పందం ద్వారా ప్రత్యేక జీవ ఔషధాల తయారీలో సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది.