ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి 7.1 నుంచి 7.3 శాతంగా నమోదు కావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. 2027-28లో జీడీపీ వృద్ధి 6.6 నుంచి 7 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. బలమైన వ్యయాలు, ప్రజా మౌలిక సదుపాయాల పెట్టుబడులతో ప్రైవేట్ రంగ మూలధన వ్యయాలు పెరగడం ఇందుకు దోహదపడతాయని తెలిపింది.