భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ

భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
  • ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72% వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేయనుంది. ఇందు కోసం 5.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.53,000 కోట్లు) వెచ్చించనుంది. భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదే అవుతుంది.

  • ఐడీబీఐలో ప్రభుత్వానికి ఉన్న 30.48% (విలువ రూ.26,620 కోట్లు), ఎల్‌ఐసీకి ఉన్న 30.24% (రూ.26,440 కోట్లు) వాటాలను ఫెయిర్‌ఫాక్స్‌ అనుబంధ సంస్థ కొనుగోలు చేయడానికి, ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. వాటాల విక్రయ అనంతరం కేంద్రానికి ఐడీబీఐ బ్యాంకులో మైనారిటీ వాటా ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram