ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026, జులైలో అంచనా వేసిన 6.4% కంటే ఇది 0.6% అధికం. బలమైన దేశీయ గిరాకీ, సేవల కార్యకలాపాలు భారత్‌ను అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల సరసన నిలబెడుతోందని ఐఎంఎఫ్ తాజాగా తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగిన వార్షిక సమావేశంలో వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది.