దేశంలో 2026, సెప్టెంబరులో ద్రవ్యోల్బణ రేటు 5.54%గా నమోదైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ఠ పరిమితి 4% కంటే ఇది ఎక్కువ. 2024 అక్టోబరు(6.25%) తర్వాత నమోదైన అత్యధిక ద్రవ్యోల్బణం ఇదే. 2026, జనవరిలో 2.74% మేర ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నుంచి మే వరకు 3.21% నుంచి 3.93% మేర నమోదైంది. జూన్‌లో 4.38%, జులైలో 4.45%, ఆగస్టులో 4.83% మేర నమోదుకాగా, తొలిసారి సెప్టెంబరులో 5.54%కి చేరింది. ఈ విషయంలో తొలి అయిదు స్థానాల్లో తమిళనాడు(6.81%), ఒడిశా(6.70%), మధ్యప్రదేశ్(6.68%), తెలంగాణ(6.64%), ఆంధ్రప్రదేశ్(6.29%) ఉన్నాయి.