తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్‌ టాప్‌

తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్‌ టాప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో మనదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అధికంగా జపాన్‌ నుంచి వచ్చాయి. ఆ త్రైమాసికంలో జపాన్‌ నుంచి రికార్డు స్థాయిలో 5.71 బిలియన్‌ డాలర్ల (రూ.54,000 కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం అంతా కలిపినా, జపాన్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐ 3.74 బిలియన్‌ డాలర్లే. సమీక్షా త్రైమాసికంలో మనదేశంలోకి వచ్చిన మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 19.81 బిలియన్‌ డాలర్లలో జపాన్‌ వాటా 29%.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram