రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) 2026, అక్టోబరు 7న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. దీంతో ఇళ్లు, కార్ల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకునే వారిపై వడ్డీ భారం పెరగనుంది. 2025లో ఆర్‌బీఐ 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గించింది.
2023 ఫిబ్రవరి తర్వాత అంటే 44 నెలల అనంతరం వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. మరో వైపు, విధాన వైఖరి ‘తటస్థం’ నుంచి ‘క్రమబద్ధమైన కఠిన’ వైఖరికి మార్పు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత అధిక చమురు ధరలు, బలహీనమైన కరెన్సీలు, ఎల్‌నినో ప్రభావం వంటి వాటి ఒత్తిడి కారణంగా ప్రపంచంలోని కీలక కేంద్ర బ్యాంకులు అన్నీ వడ్డీ రేట్లను పెంచుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పెంపు చోటు చేసుకుంది.