గాలియం నైట్రైడ్ (గ్యాన్) సెమీ కండక్టర్ సాంకేతికత అభివృద్ధి కోసం ప్రభుత్వ పరిశోధనా సంస్థ సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్పింట్రానిక్స్ ఏఐ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్వదేశీ గ్యాన్ సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు, ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఈ భాగస్వామ్యం ద్వారా అంచనా వేస్తారు. రక్షణ, రోదసి, టెలికాం, ఈవీ రంగాల్లో గ్యాన్ చిప్‌లు అవసరం.