దేశంలో జీఎస్టీ వసూళ్లు 2026, సెప్టెంబరులో రూ.2,03,521 కోట్లకు చేరాయి. 2025లో ఇదే నెలతో పోలిస్తే 14.7% వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ అక్టోబరు 1న తెలిపింది. దేశీయ వ్యాపార కార్యకలాపాల ద్వారా రూ.1,37,996 కోట్లు, దిగుమతుల ద్వారా రూ.65,525 కోట్ల ఆదాయం వచ్చింది. రిఫండ్ల కింద రూ.27,001 కోట్ల మేర వెళ్లాయి. దీంతో నికర ఆదాయం రూ.1,76,520 కోట్లు, నికర వృద్ధి 18.1% మేర నమోదైంది.