భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీతో ఫ్రాన్స్ సంస్థ ఈడీఎఫ్ పవర్ సొల్యూషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎన్‌టీపీసీ, ఈడీఎఫ్‌నకు చెందిన అనుబంధ కంపెనీ ఈడీఎఫ్ పవర్ సొల్యూషన్స్ కలిసి 50:50 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నాయి. తక్కువ కర్బన ఉద్గారాలతో కూడిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టులను సంయుక్తంగా అభివృద్ధి చేసి, నిర్వహించే బాధ్యతలను ఈ జేవీ ద్వారా రెండు సంస్థలు చేపట్టనున్నాయి.