ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను దాదాపు 7 శాతానికి ప్రపంచ ఏజెన్సీలైన ఎస్‌అండ్‌పీ, ఫిచ్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఓఈసీడీ పెంచాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతల ప్రభావం ఉన్నప్పటికీ.. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన దేశీయ గిరాకీ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే అదనపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ప్రస్తుత సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను కనీసం 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ, ఫిచ్ తెలిపాయి.