సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ)కు రుణ హామీ పథకాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గరిష్ఠ రుణ పరిమితిని రూ.1000 కోట్లకు పెంచారు. ఎంఎఫ్‌ఐ పథకాన్ని 2026 మార్చి 20న తీసుకొచ్చారు. ఈ పథకం గడువు 2026, జూన్ 30 వరకు ఉండగా, తాజాగా ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.770 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.