దేశంలో మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం 14 ఉన్నాయి. అవి: భెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, గెయిల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఓఐఎల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ, సెయిల్. మూడేళ్ల వార్షిక నికరలాభం రూ.5,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండి; వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు కలిగి, వరుసగా మూడేళ్ల పాటు రూ.15,000 కోట్ల నికర విలువను పొందిన కంపెనీలు మహారత్న హోదాకు అర్హత పొందుతాయి.