ప్రజ్ఞాన్‌ ఓజా

ప్రజ్ఞాన్‌ ఓజా

భారత పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అక్టోబరు నెల ఆరంభంలో అజిత్‌ అగార్కర్‌ పదవీ కాలం పూర్తి కావడంతో కమిటీలో సీనియర్‌ అయిన ఓజా.. తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి చీఫ్‌ సెలక్టర్‌గా నియమితులయ్యారు.

  • అగార్కర్‌ వైదొలగడంతో సెలక్షన్‌ కమిటీలో ఏర్పడిన ఖాళీని మాజీ స్పిన్నర్‌ రమేశ్‌ పొవార్‌ భర్తీ చేయనున్నాడు. అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపేలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఏకాభిప్రాయంతో రమేశ్‌ నియామకాన్ని ఆమోదించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram