జపాన్‌లోని నగోయాలో 2026, అక్టోబరు 19న జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 11 పతకాలు గెలుచుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, అయిదు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. ఒక్క అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు లభించాయి.
పురుషుల లాంగ్‌జంప్ (టీ47)లో నిషాద్ కుమార్ పసిడి పతకం సాధించాడు. అతడు 7.11 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. 6.99మీతో ఖసనోవ్ (ఉజ్బెకిస్థాన్) రజతం నెగ్గగా.. శ్రీలంకకు చెందిన సర్ఫాన్ (6.55మీ) కాంస్యం గెలుచుకున్నాడు.
పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్46)లో రింకు హుడా పసిడి పతకం నెగ్గాడు. అతడు 65.11 మీటర్ల త్రో చేశాడు. ఇదే ఈవెంట్లో భారత్‌కు రజత పతకం కూడా లభించింది. 65.02 మీటర్ల త్రోతో అజీత్ సింగ్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు.
మహిళల షూటింగ్‌లో మోనా అగర్వాల్ స్వర్ణం సాదించింది. 2026 పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు లభించిన తొలి స్వర్ణపతకమిది. ఆర్2 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో ఆమె 250 పాయింట్లు స్కోర్ చేసింది. ఇది పారా ఆసియా క్రీడల రికార్డు. ఇదే విభాగంలో అవని లేఖరా (249.6) రజతం గెలుచుకుంది.