పారా ఆసియా క్రీడలు

పారా ఆసియా క్రీడలు

పారా ఆసియా క్రీడలు జపాన్‌లోని నగోయా వేదికగా 2026, అక్టోబరు 18న ప్రారంభమయ్యాయి. భారత్‌ నుంచి 11 క్రీడాంశాల్లో 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో పురుషులు 112 మంది కాగా.. మహిళలు 56 మంది. ఈ క్రీడలు అక్టోబరు 24న ముగుస్తాయి. చైనాలో జరిగిన 2022 క్రీడల్లో భారత్‌ తరఫున 303 మంది పారా అథ్లెట్లు పోటీ పడి.. 29 స్వర్ణాలు సహా 111 పతకాలు సాధించారు.

  • పురుషుల తరఫున షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ పతాకధారిగా వ్యవహరించగా.. మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ స్ప్రింటర్‌ సిమ్రన్‌ శర్మ త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందుకు సాగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram