అంతర్జాతీయ క్రికెట్‌కు పూనమ్‌ రౌత్‌ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు పూనమ్‌ రౌత్‌ గుడ్‌బై

భారత సీనియర్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల ఈ ముంబయి ప్లేయర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. పూనమ్‌ 2009-21 మధ్య 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. వన్డేల్లో మూడు శతకాలు సహా 2,288 పరుగులు చేసిన పూనమ్‌.. టీ20ల్లో నాలుగు అర్ధశతకాలతో 719 పరుగులు సాధించింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో పూనమ్‌ సభ్యురాలు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram