పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. 2026, అక్టోబరు 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు. 10 క్రీడాంశాల్లో వీళ్లు పోటీపడనున్నారు. శీతల్ దేవి (ఆర్చరీ), అవని లేఖరా (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్) లాంటి స్టార్లు ఈ జట్టులో ఉన్నారు. టీమ్ అధికారులు, సహాయక సిబ్బంది 94 మందితో కలిసి మొత్తం 275 మందితో కూడిన భారత బృందం జపాన్ వెళ్తుంది.