ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఉదయ్‌వీర్ సిద్ధు స్వర్ణం నెగ్గాడు. 2026, అక్టోబరు 11న కైరోలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో అతడు 240.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీ షూటర్ క్రిస్టియన్ రీజ్ (240.1) రజతం నెగ్గాడు. పావోలో మోనా (219.8) కాంస్యం దక్కించుకున్నాడు.